బ్యాడ్‌మింటన్

పి.వి సింధు ఒక గెలుపుతో తన ఫ్రెంచ్ ఓపెన్ క్యాంపెయిన్ ప్రారంభించింది

బ్యాడ్‌మింటన్   |   January 31, 2020

పి.వి సింధు ఒక గెలుపుతో తన ఫ్రెంచ్ ఓపెన్ క్యాంపెయిన్ ప్రారంభించింది

ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజయం తర్వాత అనేక నిరాశల అనంతరం, పి.వి సింధు బి.డబ్ల్యు.ఎఫ్ సూపర్ 750 ఈవెంట్ లో తిరిగి తన ఫామ్ ని సంపాదించుకొంది.

ప్రపంచ ఛాంపియన్ పి.వి సింధు మంగళవారం నాడు ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్‌మింటన్ టోర్నమెంటులో కెనడాకు చెందిన మిఛెల్ లీ పై సౌకర్యవంతమైన 21-15, 21-13 గెలుపుతో తిరిగి తన విజయాల బాటకు చేరుకొంది.

ప్రపంచ నంబర్ 8 లీ తో పోలిస్తే, సింధు దూకుడుగా ముందుకు వెళ్ళడంలో నిదానమే, అదే ఆ కెనడాకు చెందిన అమ్మాయి మొదటి గేములో అవకాశంగా తీసుకునేందుకు వీలు కల్పించింది. ఆ తర్వాత, ఈ భారతీయ అమ్మాయి తన పోరాటానికి ముందడుగు వేసి ఆట మధ్య-విరామ సమయానికి 11-8 ఆధిక్యం సంపాదించింది.

విరామం తదనంతరం సింధు ఒక దశలో ప్రత్యర్థిపై ఆరు పాయింట్లు గెలుచుకొని, మ్యాచ్ ను తన నియంత్రణ లోనికి తీసుకొంది. ఆమె యొక్క అవిశ్రాంతమైన ఆట సౌకర్యవంతంగా ఆమెను మొదటి మ్యాచ్ లో విజయతీరాలకు చేర్చింది.

రెండవ గేమ్ లో లీ మేల్కొంది, ఆమె సింధు యొక్క ఎడమచేతిని పరీక్షిస్తూ తనకు ఒక మంచి ప్రారంభాన్ని ఇచ్చింది. ప్రపంచ ఛాంపియన్ కావడానికి ఆ గలగల మాత్రమే సరిపోలేదు, మరియు సింధు విరామ సమయానికి ఒక చక్కని 11-10 ఆధిక్యముతో కెనడా అమ్మాయిని ముని కాళ్ళపై నిలిపింది.

ఏది ఏమైనప్పటికీ, లీ అప్పుడు, విరామములో, విరామం తర్వాత తన శాయశక్తులా పోరాడినప్పటికీ, ఆమె కేవలం మూడు పాయింట్లు మాత్రమే స్కోరు చేయగలిగింది, సింధు మరొక విజయముతో ఆమెను దూరంగా నెట్టేసింది.

సింధు, స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో ఆగస్టులో జరిగిన బి.డబ్ల్యు.ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ టైటిల్ ని మొదటి సారిగా గెలుచుకొంది. ఫైనల్ లో, ఆమె తన ప్రత్యర్థి నొజోమీ ఒకుహర ని ఓడించి ఈ పోటీలో బంగారు పతకం గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలుగానూ, మరియు ఈ ఈవెంటులో ఐదు పతకాలు గెలుచుకున్న మహిళ ఝాంగ్ నింగ్ తర్వాత పట్టికలో కేవలం రెండో మహిళగా కావడానికి పెద్దగా కష్టపడలేదు.

ఏది ఏమైనా అప్పటినుండీ, సింధు వరుసగా నిరాశల పరంపరను ఎదుర్కొంది. తర్వాతి నెలలో ఆమె చైనా ఓపెన్ లో రెండవ రౌండులో ఓడిపోయింది మరియు ఆ తదనంతరము కొరియా ఓపెన్ లో మొదటి రౌండులోనే ఓటమి చవి చూసింది. గత వారపు డెన్మార్క్ ఓపెన్ లో రెండవ రౌండు ఓటమితో ఈ నెల మొదట్లో మరిన్ని దెబ్బలు తగిలినట్లయింది.

తర్వాత గురువారం రోజున సింధు సింగపూర్ కు చెందిన యెవో జియా మిన్ తో తలపడబోతోంది, మరి ఒకవేళ ఆమె తొలి రౌండ్లలో గట్టెక్కగలిగితే క్వార్టర్ ఫైనల్స్ లో ఈ భారత అమ్మాయి ఆఖరుకు టాప్ సీడ్ తై త్జు ను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
రచన:సందీప్ బెనర్జీ