క్రికెట్

టీ20ఐ లలో రోహిత్ కు తోడు ఎవరు జతకట్టాలి – రాహుల్ లేదా ధావన్?

క్రికెట్   |   November 12, 2019

టీ20ఐ లలో రోహిత్ కు తోడు ఎవరు జతకట్టాలి – రాహుల్ లేదా ధావన్?

50- ఓవర్ల ఫార్మాట్ విషయానికి వచ్చినప్పుడు రోహిత్ శర్మ మరియు శిఖర్ ధావన్ జంటను విడదీయలేని జంటగా భావించవచ్చు, ఐతే టీ20ఐ ల విషయానికి వస్తే మాత్రం ఆ భావన సరి కాదు. రోహిత్ ఒడిఐ లలో లాగానే ఈ ఫార్మాట్ లో కూడా అదే భీకర రూపంతో కొనసాగుతూ ఉంటాడు, కానీ ధావన్ మాత్రం అదే శక్తితో ఉన్నట్లుగా కనిపించడు.

అందుకనే టీ20ఐ లలో అతని స్థానం ఎల్లప్పుడూ పరిశీలనలో ఉంటూ ఉంటుంది. ఔను, ప్రస్తుతం దక్షిణాఫ్రికాపై నడుస్తున్న సీరీస్ లో భాగంగా మొహాలీలో జరిగిన రెండో టీ20ఐ లో భారత్ విజయంలో 40 పరుగుల తన ఇన్నింగ్స్ తో అతడు ముఖ్యమైన పాత్ర పోషించాడు, ఐతే ఈ సంవత్సరం టీ20ఐ లలో అతడు 18.12 సగటుతో అది కూడా కేవలం 106.61 స్ట్రైక్ రేటుతో మాత్రమే కొనసాగుతున్నాడు. ఒక ఓపెనర్ కు ఆమోదయోగ్యమైన శ్రేణికి ఈ అంకెలు ఏ మాత్రమూ దరిదాపుల్లో కూడా లేవు.

2019 లో టీ20ఐ లలో ఓపెనర్లకు ప్రాపంచిక సరాసరి సగటు మరియు స్ట్రైక్ రేటు వరుసగా 21.92 మరియు 121.43 గా ఉంటున్నాయి. ధావన్ యొక్క అంకెలు వాటికంటే కూడా దిగువన ఉంటున్నాయి. అందువల్ల, అతడు ఎంత పేలవంగా ఉంటున్నాడో దాన్ని బట్టి అర్థమవుతుంది. అయినప్పటికీ, మీరు గనక కె.ఎల్.రాహుల్ యొక్క ఈ సంవత్సరపు అంకెలను చూస్తే, 39.00 సగటు మరియు 146.25 స్ట్రైక్ రేటుతో మూడు ఇన్నింగ్స్ లో 117 పరుగులు ధావన్ కంటే ఎంతో మెరుగైనవిగా ఉన్నాయి.

వాస్తవానికి, 2016 లో ఈ ఫార్మాట్ లో అతడు ప్రవేశం చేసినప్పటి నుండీ ఇంతవరకూ అతడు చూపిన స్థిరత్వాన్ని పరిగణించి చూస్తే, ప్రతి టీ20ఐ లోనూ కె.ఎల్. రాహుల్ ధావన్ కంటే ముందు ఓపెనింగ్ లో ఉండాలి. 2016 నుండీ వరుస సంవత్సరాలలో రాహుల్ యొక్క సగటులు వరుసగా 89.50, 39.85, 36.00 మరియు 39 గా ఉంటున్నాయి. వాస్తవానికి, 42.80 సగటుతో 899 పరుగుల అతని మొత్తమ్మీది టీ20ఐ రికార్డు, ధావన్ యొక్క 27.54 సగటుతో 1377 పరుగుల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. వారి మొత్తమ్మీది 148.10 మరియు 129.53 స్ట్రైక్ రేట్లు కూడా అత్యధిక వైరుధ్యముతో ఉన్నాయి. పైపెచ్చు, ఇండియా కోసం ఆడిన 28 టీ20 ఐల అతి తక్కువ వ్యవధిలో రాహుల్ రెండు శతకాలు కలిగి ఉండగా ధావన్ కు 54 మ్యాచ్ లలో ఒక్కటి కూడా లేదు. కాబట్టి, ఈ ఫార్మాట్ లో ఎవరు మంచి ఆటగాడో అనే ముచ్చటతో ఇది ముగుస్తుంది.

ధావన్ తన మ్యాచ్ లన్నింటినీ ఓపెనర్ గానే ఆడగా, రాహుల్ యొక్క టీ20ఐ శతకాలు రెండూ అతడు 3 వ మరియు 4 వ స్థానములో ఆడగా వచ్చినవే అని ఎవరైనా వాదించవచ్చు. అయినప్పటికీ, మనం ఒక ఓపెనర్ గా అతని గణాంకాలు చూసినప్పుడు, 41.15 సగటు మరియు 142.66 స్ట్రైక్ రేటుతో యాభై-ప్లస్ స్కోరులు ఐదింటితో కలిపి అతను చేసిన 535 పరుగులు అతని మొత్తమ్మీది టీ20ఐ కెరీర్ లో ఉత్తమమైనవిగా కనిపిస్తాయి.

వాస్తవానికి, రాహుల్, టీ20ఐ చరిత్రలో 500 లేదా అంతకు మించిన పరుగులతో ఓపెనర్ల పైకీ రెండో అత్యుత్తమ సగటు కలిగి ఉన్నాడు. అతని స్ట్రైక్ రేటు కూడా ఈ ఫార్మాట్ లో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా ఉంది మరియు 40-ప్లస్ సగటుతో దానిని కలిగియుండడమనేది ఒక టీ20ఐ ఓపెనర్ గా అతని సత్తాను చాటుతుంది.

ఆట యొక్క సుదీర్ఘ ఫార్మాట్లలో అతను ఇబ్బందులు పడి ఉండొచ్చు, ఐతే టీ20ఐ ల విషయానికి వచ్చినప్పుడు మాత్రం అతడు ఎవ్వరికీ ద్వితీయుడు కాదు. మరో వైపున, ధావన్, 2011 నుండీ కూడా తాను ఆడిన టీ20ఐ లలో ఎక్కువ భాగం సరైన పనితీరు కనబరచలేదు. ఔను, అతడు 2018 లో 40.52 సగటు మరియు 147.22 స్ట్రైక్ రేటుతో 698 పరుగుల

అద్భుతమైన పరుగులు సాధించి ఉండొచ్చు, ఐతే ఈ సంవత్సరం మరొక్కమారు అతని ఫామ్ కళావిహీనమయింది. 2018 కాకుండా, రెండు లేదా అంతకు మించిన టీ20ఐ ఇన్నింగ్స్ ఆడిన ఏ సంవత్సరము లోనూ అతడు కనీసం 30 సగటును సైతమూ కలిగియుండలేదు. అతని అత్యధిక సగటు 2016 లో 25.08 ఉండగా, తర్వాత 2017 లో అది 25.40 గా నమోదు అయింది. 2014 మరియు 2015 సంవత్సరాల్లో అతని సగటులు కేవలం 16 మరియు 7 మాత్రమే, అది కూడా వరుసగా 98.56 మరియు 87.50 డిస్మిసల్ స్ట్రైక్ రేట్లతో.

కాబట్టి, ఈ వాస్తవాలు మరియు గణాంకాలు అన్నింటినీ క్రోడీకరించి చూస్తే, రోహిత్ తో టాప్ ఆర్డరులో జతగా ఉండగల అర్హత ఉన్న బ్యాట్స్‌మన్ ఎవరో తెలుస్తుంది. గత సంవత్సరం నుండీ తన టీ20ఐ లలో ధావన్ పుంజుకొని ఉండవచ్చు, ఐతే రాహుల్ యొక్క స్థిరత్వం మరియు ప్రేలుడుతత్వము ఎడమచేతి వాటంతో ముందుకు వెళ్ళే అతణ్ణి చూసేలా చేస్తుంది. (కె.ఎల్.రాహుల్ న్యూస్ అప్‌డేట్స్ పై మరింత సమాచారం)

రచన:ప్రసెంజిత్ డే