క్రికెట్

టీ20ఐ ల నుండి కుల్‌దీప్ మరియు ఛాహల్ కు విశ్రాంతిని ఇవ్వడం ద్వారా ఇండియా లాభపడుతుందా?

క్రికెట్   |   November 12, 2019

టీ20ఐ ల నుండి కుల్‌దీప్ మరియు ఛాహల్ కు విశ్రాంతిని ఇవ్వడం ద్వారా ఇండియా లాభపడుతుందా?

“ప్రపంచవ్యాప్తంగా అన్ని జట్లూ ఒకవేళ నం.9 లేదా 10 వరకూ బ్యాటింగ్ చేస్తూ ఉండగా మనమెందుకు చేయలేక పోతున్నాము?”

దక్షిణాఫ్రికాపై టీ20ఐ సీరీస్ ప్రారంభం కావడానికి ముందు జరిగిన పత్రికా విలేఖరుల సమావేశములో కుల్‌దీప్ యాదవ్ మరియు యజువేంద్ర ఛాహల్ కు విశ్రాంతి ఇవ్వడం వెనుక కారణాల గురించి అడిగినప్పుడు విరాట్ కోహ్లీ తాజా వార్తలు ఇదే విషయాన్నే పేర్కొంది. ‘’విశ్రాంతినివ్వడం’ అనే పదం ఉపయోగించబడినప్పటికీ, వాస్తవంగా వారి బ్యాటింగ్ నైపుణ్యాల లోపం కారణంగా వారిని తప్పించడం జరిగింది.

ఈ సీరీస్ లో బ్యాటింగ్ లోతును పెంచే ప్రయోగముతో విరాట్ కోహ్లీమరియు జట్టు యాజమాన్యం ఇలా భావించారు, మరియు అందువల్లనే, కేవలం వారి శ్రేష్టమైన బ్యాటింగ్ నైపుణ్యాల కారణంగానే కుల్‌దీప్ మరియు ఛాహల్ స్థానములో కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్ మరియు రవీంద్ర జడేజా వంటి వ్రేళ్ళ-స్పిన్నర్లకు చోటు కల్పించడానికి తలూపారు (మరిన్ని వివరాలకు రవీంద్ర జడేజా న్యూస్ చూడండి).

అయినప్పటికీ, కోహ్లీ మరియు జట్టు యాజమాన్యము, తోకను పొడిగించాలని చూస్తూ తాము బౌలింగ్ లోతు పట్ల కూడా రాజీపడుతున్నాము అనే వాస్తవం పట్ల ధ్యాస వహించలేదు. దాడి చేసే రెండు బౌలింగ్ ఐచ్ఛికాలను వారు త్యాగం చేశారు మరియు ఈ సీరీస్ లో రక్షణాత్మక ధోరణిలో ముందుకు వెళ్ళారు.
ఈ సీరీస్ లో కృనాల్, జడేజా మరియు సుందర్ మొత్తం 17.5 ఓవర్ల ఒక సమ్మిళిత టోటల్ లో కేవలం ఒక్కొక్క వికెట్ మాత్రమే తీసుకోగా, ఆ ఫలితం అంత మంచిదిగా అనిపించలేదు. అయినా 7.54 ఉన్న వారి సమ్మిళిత ఎకానమీ రేటు ఆమోదించదగినదే అయినప్పటికీ, వారి 107 స్ట్రైక్ రేటు మాత్రం క్షమించరానిది.

వాస్తవానికి, ఈ సీరీస్ లో వారి దక్షిణాఫ్రికా ప్రత్యర్థుల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు, ఈ అంకెలు నేరపూరితమైన ప్రమాదంగా అనిపిస్తాయి. తబ్రేజ్ షంసీ మరియు బిజోర్న్ ఫోర్ట్యూన్ తమ ఉమ్మడి 14 ఓవర్ల టోటల్ లో ఐదు వికెట్లు తీసుకున్నారు. కావున, ఆ వికెట్లు కేవలం 16.80 స్ట్రైక్ రేటుతో వచ్చాయి మరియు వారి ఉమ్మడి ఎకానమీ రేటు 6.64 కూడా అద్భుతంగానే ఉంది.

ఇండియా విధానము ఎంత తప్పుతో కూడి ఉందో ఈ పోలిక మనకు తెలియజేస్తుంది. ఔను, దురదృష్టవశాత్తూ టాప్ ఆర్డర్ కుప్పకూలినప్పుడు పెంపొందిత బ్యాటింగ్ లోతు చాలా బాగానే పని చేస్తుంది, ఐతే అది ప్రతీ ఆటలోనూ జరగబోదు. అంతే కాకుండా చేతివ్రేళ్ళ స్పిన్నర్ల యొక్క వికెట్-తీసుకొనే సామర్థ్య లోపం ఆ మ్యాచ్ లలో సైతమూ ఎక్కువ కాలం పాటు వాళ్ళను బాధిస్తుంది. కృనాల్, జడేజా మరియు సుందర్ ల కెరీర్ టీ20ఐ స్ట్రైక్ రేట్లు వరుసగా 25.8, 26.5 మరియు 21.5 గా ఉన్నాయి. సుందర్ కు ఒక మంచి 6.23 ఎకానమీ రేటు ఉన్నప్పటికీ, అదే కృనాల్ (8.10) మరియు జడేజా (7.12) రేట్లు అత్యంత సామాన్యంగా ఉన్నాయి.

మరో వైపున కుల్‌దీప్ మరియు ఛాహల్ ఈ ఫార్మాట్ లో భారత జట్టుకోసం ఎంతో విజయవంతమైనవారుగా ఉంటున్నారు. ముందు వ్యక్తి అద్భుతమైన 11.5 స్ట్రైక్ రేటుతో 18 టీ20ఐ లలో 35 వికెట్లు తీసుకొని ఉండగా, తదుపరి వ్యక్తి శ్రేష్టమైన 15.8 స్ట్రైక్ రేటుతో 25 మ్యాచ్ లలో మరొక్కసారి 46 వికెట్లు తీసుకొని ఉన్నాడు. మరియు కుల్‌దీప్ యొక్క 6.72 ఎకానమీ రేటు అటువంటి అద్భుతమైన వికెట్-తీసుకునే నైపుణ్యముతో వెళుతుంటే, అతణ్ణి అటువంటి శక్తివంతంగా దాడిచేసేలా ఏది చేస్తుంది. ఈ ఫార్మాట్ లో ఛాహల్ యొక్క కెరీర్ ఎకానమీ రేటు కొంత ఎక్కువగానే ఉన్నప్పటికీ, అతడు తన వికెట్-తీసుకునే సామర్థ్యంతో దాన్ని భర్తీ చేస్తున్నాడు.

ఔను, వారి పనితీరులు కొంతవరకు ఆలస్యంగానే చురుకు అవుతున్నాయి, ఐతే మొత్తమ్మీద వాళ్ళ సంఖ్యలను ఏ మాత్రమూ విస్మరించలేము. ఏ ఆటగాడైనా ఫామ్ లో కొంత దిగువకు వెళ్ళవచ్చు మరియు వాళ్ళను మార్చడానికి జట్టుకు అంతకంటే మెరుగైన ఐచ్ఛికం ఉంటే తప్ప వాళ్ళను తప్పించకూడదు. భారత క్రికెట్ జట్టు కు ప్రస్తుతం ఆడుతున్న చేతివ్రేళ్ళ స్పిన్నర్లు కుల్‌దీప్ మరియు ఛాహల్ కు ఏ విధంగానూ మెరుగైన వాళ్ళు కాదు.

పైపెచ్చు, టీ20 క్రికెట్ ప్రపంచ కప్ ను, బౌండరీలు పెద్దవి మరియు ట్రాక్ లు బ్యాటింగ్ కు చాలా చక్కగా ఉండే ఆస్ట్రేలియా పరిస్థితుల్లో ఆడబోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో, తమ చేతుల వరకూ ఉపాయాలు కొన్ని ఉండే బౌలర్లను కలిగియుండడం ఎంతో అవసరం. బ్యాట్స్‌మెన్ తమపై దాడి చేయాలని చూసినప్పుడు కుల్‌దీప్ మరియు ఛాహల్ ఎల్లప్పుడూ అటువంటి పరిస్థితుల్లోనే పాటుపడ్డారు. అటువంటి ప్రశాంతమైన ట్రాక్స్ పై కూడా వ్యత్యాసాలు వాళ్ళని ఒక బలమైన శక్తిగా తయారు చేశాయి.

ఔను, వారి సమ్మేళనముతో ప్రయోగం చేయడానికి ఇండియాకు ఇంకా మరో 25 టీ20ఐ మ్యాచ్ లు ఉన్నాయి. ఐతే ఆ పని చేసేటప్పుడు సమయం మించి పోకుండా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒడిఐ ప్రపంచ కప్ కు ముందు వారి నంబర్ 4 స్థానము పరిష్కారములో ఏమి జరిగిందో ఖచ్చితంగా అదే. మరీ శృతి మించిన ప్రయోగాలు గందరగోళానికి దారి తీస్తాయి మరియు తమ అత్యంత కీలకమైన బ్యాటింగ్ స్థితితో వాళ్ళు మెగా టోర్నమెంటుకు వెళితే అది మొత్తం బహిర్గతమైపోయింది.

భారతజట్టు యాజమాన్యము ఆ విషయాన్ని మనసులో ఉంచుకోవాలి మరియు అదే పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. కుల్‌దీప్ మరియు ఛాహల్ ఇండియా యొక్క బౌలింగ్ దాడి యొక్క ముఖ్యమైన భాగంగా రూపొందారు మరియు ఆస్ట్రేలియాలో జరగబోయే మెగా ఈవెంట్ సందర్భంగా వారి పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది.

రచన: ప్రసెంజిత్ డే