క్రికెట్

దీప్తి శర్మ ఎంత ఉత్తమంగా ఉంది?

క్రికెట్   |   November 12, 2019

దీప్తి శర్మ ఎంత ఉత్తమంగా ఉంది?

బెంగళూరులో దక్షిణాఫ్రికా మహిళా జట్టుపై జరిగిన సీరీస్ లో 2014, నవంబర్ 28 వ తేదీన ఇండియా ఆడిన మూడవ ఒడిఐ లో భారత మహిళా క్రికెట్ జట్టు కోసం తన అంతర్జాతీయ ఆరంగేట్రం చేసినప్పుడు దీప్తి శర్మ వయస్సు 17 ఏళ్ళు. ఆమె కలలు గన్న అంతర్జాతీయ కెరీర్ కు అది ఆమె అనుకున్నట్లుగా గొప్ప ప్రారంభమైతే కాలేదు. 3 వ స్థానములో బ్యాటింగ్ కు దిగిన ఈ ఆరంగేట్ర క్రీడాకారిణి 18 బంతులను ఎదుర్కొని అతి కష్టం మీద కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ కు వెనక్కి నడవాల్సి వచ్చింది.

ఐతే ఆ తర్వాత ఆమె బంతితో పునరాగమనం చేసి, తన పోరాట పటిమ, లక్షణము మరియు తాను కలిగియున్న ఆత్మవిశ్వాసాన్ని చూపగలిగింది. ఇన్నింగ్స్ యొక్క 28 వ ఓవర్ లో దక్షిణాఫ్రికా 121/2 స్కోరుతో తమ 181 పరుగుల లక్ష్యం దిశగా సునాయాసంగా వెళుతున్నట్లు కనిపించింది. అయితే, దీప్తి బౌలింగ్ కు వచ్చి క్రీజులో పాతుకుపోయి ఉన్న బ్యాటర్లు నాదైన్ మూడ్‌లీ (54) మరియు మిగ్నోన్ డు ప్రీజ్ (46) ఇద్దరినీ కేవలం మూడు డెలివరీల వ్యవధిలోనే పెవిలియన్ కు సాగనంపింది.

దాని తర్వాత దక్షిణాఫ్రికా మరో రెండు వికెట్లను త్వరగా కోల్పోయింది మరియు దీప్తి వేసిన మరి కొన్ని కఠినమైన ఓవర్ల కారణంగా దక్షిణాఫ్రికా తన లక్ష్యం వైపు సాగడం ఇబ్బందిగా మారింది. అయినప్పటికీ సందర్శక జట్టు మ్యాచ్ గెలవగలిగింది, ఐతే యువ ఆరంగేట్ర క్రీడాకారిణి తన అతి శ్రేష్టమైన స్పెల్ 10-0-35-2 తో ఒక చక్కని ముద్ర వేసుకోగలిగింది. గెలుపు సాధ్యమై ఉంటే మాత్రం తన తొలి మ్యాచ్ ఆమెకు చిరస్మరణీయంగా ఉండేదే, అయినా మంచి విషయాలు జరగాలంటే సమయం పడుతుంది మరి.

ఐదు సంవత్సరాలు గడిచేసరికి, ఆమె మహిళల ఒడిఐ లో నంబర్ 2 ఆల్-రౌండర్ గా ర్యాంకింగ్ పొందింది మరియు టీ20ఐ ఫార్మాట్ లో సైతమూ ర్యాంకింగ్స్ మెరుగుపరచుకోవడానికి నిలకడగా ముందుకు సాగుతోంది. మరియు అది ఆట యొక్క అత్యంత తక్కువ నిడివి గల ఫార్మాట్. తన అంతర్జాతీయ ఆరంగేట్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన కోరికను తీర్చుకోవడానికి అది ఆమెకు అవకాశాన్నిచ్చింది.

ఐదు మ్యాచ్ ల శ్రేణిలో భాగంగా మంగళవారం సూరత్ లో జరిగిన మొదటి టీ-20 ఐ లో భారత మహిళా జట్టుకు ప్రత్యర్థి మరోమారు దక్షిణాఫ్రికా అయింది. ఆమెయొక్క ప్రారంభ అంతర్జాతీయ మ్యాచ్ లాగానే, ఇండియా మరొక్కసారి 130/8 యొక్క పనికిమాలిన టోటల్ కు పరిమితమయింది. ఈ సారి 5 వ స్థానములో బ్యాటింగ్ కి దిగిన ఆమె కేవలం 16 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేయగలిగింది. అయినప్పటికీ, ఆమె తన పదునైన బౌలింగ్ తో మరొక్కసారి ప్రత్యర్థి జట్టును దెబ్బతీసింది.


దక్షిణాఫ్రికా మహిళలు నాలుగు ఓవర్లు పూర్తయ్యేసరికి నిలకడైన ప్రారంభంతో 1 వికెట్ నష్టానికి 29 పరుగులతో ఉన్నారు. ఐతే దీప్తి బౌలింగ్ కు వచ్చి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో తాజ్మిన్ బ్రిట్స్ మరియు నాదైన్ డి క్లర్క్ ఇద్దరినీ పెవిలియన్ చేర్చింది. అంత మాత్రమే కాదు, అది మెయిడెన్ కూడా అయింది. ఆ ఓవర్ తోనే మ్యాచ్ యొక్క గమనము ఇండియా వైపుకు అనుకూలంగా మారింది. ఈ 22 ఏళ్ళ అమ్మాయి తొమ్మిదో ఓవర్లో మళ్ళీ బౌలింగ్ కు వచ్చి ఈ సారి మరొక్కసారి మెయిడెన్ ఓవర్ వేయడంతో పాటుగా సూనె లూస్ ని డిస్మిస్ చేసింది. ఆమె తర్వాతి ఓవర్ కూడా మెయిడెన్ అయింది మరియు తాను వేసిన 19 వ బంతి వరకూ ఒక్క పరుగును కూడా ఇవ్వలేదు. ఔను, ఆమె ఆఖరి ఓవర్ నుండి దక్షిణాఫ్రికా ఎనిమిది పరుగులు తీసుకొంది, ఐతే అటువంటి తక్కువ స్కోర్ మ్యాచ్ ని కాపాడుకోవడంలో ఆమెయొక్క గణాంకాలను 4-3-8-3 చూసి ఆమె పనితీరు యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఈ సారి ఆమె శ్రమ వృధా కాలేదు, ఇండియా యొక్క టోటల్ కు 11 పరుగుల తక్కువలోనే 119 పరుగులకు దక్షిణాఫ్రికా చాప చుట్టేసింది.

దీప్తికి సగర్వంగా ప్లేయర్-ఆఫ్-ది మ్యాచ్ ప్రదానం చేయబడింది మరియు ఈ పనితీరుతో ఆమె అత్యుత్తమమైన 5.99 ఎకానమీ రేటుతో అంతే సంఖ్యలో టీ20 ఐ యొక్క 31 వికెట్లను తన పేరిట ఖాతాలో వేసుకోగలిగింది. 15.21 సగటుతో 213 పరుగుల ఆమె బ్యాటింగ్ నంబర్లు ఒక బ్యాటర్ గా ఆమె పట్ల ఒక సదభిప్రాయాన్ని ఏర్పరచకపోవచ్చు కానీ 41.81 సగటుతో 1380 పరుగుల ఆమె ఒడిఐ నంబర్లు ఆమె ఎంత మంచి బ్యాటరో అనే విషయాన్ని తెలియజేస్తాయి. ఔను, వరుసగా ఒడిఐ మరియు టీ20 లలో 63.41 మరియు 91.81 యొక్క స్ట్రైక్ రేట్లు అత్యుత్తమమైనవిగా అనిపించకపోవచ్చు కానీ దానిమీద పనిచేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తాయి.

అయినప్పటికీ, ఒక పెద్ద హిట్టర్ గా ఆమెకు పరిమితులు ఉన్నా, 2016 నుండీ మహిళల టీ20ఐ లలో 30-ప్లస్ వికెట్లు తీసుకొని మరియు 200-పైచిలుకు పరుగులను సాధించిన 11 మంది అరుదైన వారిలో ఆమె ఒకరుగా ఉన్నారు. మరియు తాను ఆడబోయే సంవత్సరాల సంఖ్యను లెక్క లోనికి తీసుకుంటే ఆమె ఒక మెరుగైన క్రీడాకారిణి కాబోతున్నారు.

ఒక ఆల్-రౌండర్ గా దీప్తి యొక్క సమర్థతల గురించి ఆమె యొక్క ఒడిఐ రికార్డు ఒక మెరుగైన అవగాహనను ఇస్తుంది. 2014 లో తాను రంగప్రవేశం చేసినప్పటి నుండీ మహిళల ఒడిఐ లలో 50 లేదా అంతకు మించి వికెట్లు తీసుకున్న వారిలో ఆమె అత్యధిక పరుగులు (1380) చేసిన మూడో వ్యక్తిగా ఉన్నారు. కేవలం ఎల్లీస్ పెర్రీ (2025) మరియు డేన్ వాన్ నీకెర్క్ (1438) మాత్రమే ఆమె కంటే పరుగులలో ముందున్నారు. వాస్తవానికి ఆమె, తన ఒడిఐ కెరీర్ ప్రారంభించిన తర్వాత 1000 – ప్లస్ పరుగులు స్కోర్ చేసిన మరియు 50- ప్లస్ వికెట్లు తీసిన కేవలం నలుగురిలో ఒకరుగా ఉన్నారు. మరియు ఆమె దీనంతటినీ వరుసగా తన శ్రేష్టమైన బ్యాటింగ్ మరియు బౌలింగ్ సగటులు 41.81 మరియు 27.39 లతో సాధించారు.

కాబట్టి, ఈ వాస్తవాలు మరియు గణాంకాలు అన్నీ ఒక క్రీడాకారిణిగా దీప్తి యొక్క శ్రేణిని చూపిస్తున్నాయి. ఆమె, పెర్రీ మరియు నీకెర్క్ వంటి ఆల్-రౌండర్ల లాగా అరుదుగా అదే విధమైన ధ్యాస పొందుతోంది, ఐతే ఆమె నిశ్శబ్దంగా తన స్వంత వారసత్వాన్ని మలచుకుంటోంది. మరింతగా ఇండియా క్రికెట్ న్యూస్ చదవండి.

రచన: ప్రసెంజిత్ డే