క్రికెట్

ఇండియా T20I ఏర్పాటుకు షిఖర్ దావత్ తన స్థానం నిలుపుకోగలడా?

క్రికెట్   |   November 12, 2019

ఇండియా T20I ఏర్పాటుకు షిఖర్ దావత్ తన స్థానం నిలుపుకోగలడా?

వన్-డే క్రికెట్ కు సంబంధించి షిఖర్ దావన్ ఉత్తమమైన బ్యాట్స్ మన్. ఎంతైనా, అతను భారతదేశం కోసం మూడు ప్రధానమైన ఐసీసీ ట్రోఫీల్లో టాప్ ఆర్డర్ లో కీలకమైన బాధ్యతలు వహించాడు కదా. అయితే, T20 విషయంలో మాత్రం, ధావన్ ODI లలో ఉన్నంత ఉత్తమంగా లేడు.

నిజానికి 31 ఏళ్ల ఈ క్రీడాకారుని T20 కెరీర్ ఎల్లప్పుడూ కుతూహాలంగానే ఉంది. గడిచిన సంవత్సరాల్లో ఇండియన్ T20 లీగ్ లో అతని సామర్థ్యాలు చూసినప్పుడు ఫిర్యాదు చేయడానికి ఈ ఎడమ చేతి వాటం క్రీడాకారుడు ఎలాంటి కారణం మీకు ఇవ్వలేదు. ధావన్ కు సగటున 33.42 రేటుతో క్యాష్ రిచ్ లీగ్ లో 4579 పరుగులు ఉన్నాయి మరియు

దీనిలో యాభై-ప్లస్ 37 స్కోర్స్ కూడా ఉన్నాయి. అయితే, మీరు అతని మొత్తం స్ట్రైక్ రేట్ 124.80ని చూసినప్పుడు, అది T20లో మీరు ప్రాధాన్యతనిచ్చేది కాదు. కాబట్టి, చాలా డెలివరీలు వ్యర్థమవకుండా టాప్ ఆర్డర్ లో వేగవంతమైన రేట్ స్కోర్ చేయగలిగే బ్యాట్స్ మన్ కు చాలా జట్లు ప్రాధాన్యతత ఇస్తాయి కాబట్టి అతన్ని ఓపెనర్ గా అందరూ ఎంచుకోరు.

కానీ ధావన్ ఇండియన్ T20 లీగ్ లో 159 T20 మ్యాచెస్ ఇంకా ఆడాడు మరియు అతనికి తరచుగా అనుకూలంగా పని చేసే విషయం అతని అనుభవం మరియు ఇన్నింగ్స్ కు యాంకర్ చేయగలిగే సామర్థ్యం. అది ఫ్రాంఛైజ్ క్రికెట్ లో అమూల్యమైనది. ఎందుకంటే జట్టులో ఉండే యువ ఆటగాళ్లకి మార్గదర్శకత్వంవహించే క్రీడాకారుల కోసం యాజమాన్యం అన్వేషిస్తుంది.

అయితే, అంతర్జాతీయ స్థాయిలో కావల్సిన ఆవశ్యకతలు మాత్రం పూర్తిగా వేరుగా ఉంటాయి. 2017 చివరి వరకు, ధావన్ ఇండియా కోసం 28 T20లు ఆడి మొత్తం 543 పరుగులు చేసాడు. అయితే ఆ పరుగులు కేవలం 118.30 స్ట్రైక్ రేట్ గా వచ్చాయి. ఇది అంతర్జాతీయ జట్లకు అంత అనుకూలంగా పని చేయదు. ఎందుకంటే అక్కడ ఎల్లప్పుడూ మెరుగైన రేట్ సాధించే బ్యాట్స్ మన్ ఉంటారు. ఇంకా ఇది జట్టు మెరుగుదల కోసం ఎల్లప్పుడూ అవసరం. కాబట్టి ఆ సమయంలో, అది అతని T20I కెరీర్ ఒక ముగింపుగా కనిపించింది.

అయితే, T20లలో తన బ్యాటింగ్ కు అతను అనుసరించిన విధానంలో తెచ్చిన మార్పు ను 2018 ఆరంభం చూపించింది. అతను మరింత తీక్షణంగా మరియు ముందస్తు జాగ్రత్తగా ఆడాడు. అతను ఎదుర్కొన్న ప్రతీ బంతిలో ధావన్ స్కోరింగ్ అవకాశం తీసుకున్నాడు. ప్రతీ డెలివరి నుండి రాబట్టడానికి ప్రయత్నించాడు. అతను తన టెక్నిక్ ను అంతగా మార్చలేదు. ఈ ఎడమచేతి వాటం క్రీడాకారుడు ఇంతకు ముందు ఆడిన విధంగా అదే సంప్రదాయమైన స్ట్రోక్స్ ని ఆడాడు కానీ అతను మార్చిందల్లా అతని ఆలోచనా ధోరణి.

అతని ప్రయత్నాలు మంచి ఫలితాల్ని ఇచ్చాయి. 2018 చివరి భాగం అతను ఎంత బాగా ప్రదర్శించాడో చూపించింది. ఆ సంవత్సరంలో అతను సాధించిన సంఖ్యలు లోగడ సంవత్సరాల్లో సాధించిన వాటి కంటే మెరుగ్గా ఉన్నాయి. ధావన్ ఆ సంవత్సరంలో 17 అవుటింగ్స్ లో అమోఘమైన సగటు 40.52 కి భారీగా 689 పరుగులు స్కోర్ చేసాడు కానీ అతను ఆ పరుగుల్ని 147.22 స్ట్రైక్ రేట్ తో స్కోర్ చేసాడు. ఇంకా, అతను ఆరు యాభైల్ని కూడా స్కోర్ చేసాడు. అది అతని మొదటి 28 మ్యాచెస్ ల సమయంలో అతను ఏదైతే సాధించాడో దానికి రెట్టింపుగా ఉంది.

నిజానికి, అతని ఇండియన్ T20 లీగ్ నంబర్లు ఆ సంవత్సరంలో సగటున 38. 23కి 497 పరుగులుగా ఉన్నాయి మరియు స్ట్రైక్ రేట్ 136.9గా ఉంది. ఇది రాబోయే సంవత్సరంలో ఏమి రాబోతోందో ముందుగానే సూచించింది. ధావన్ రానున్న T20I లలో టీం ఇండియా కోసం తన పెర్ఫార్మెన్సెస్ తో ఆ వాస్తవాన్ని పునరుద్ఘాటించాడు.
ఆ సమయంలో, అతను ఒప్పందాన్ని పూర్తిగా ముగించినట్లుగా కనిపించింది. కానీ ఇక్కడ 2019లో మనం చూసినప్పుడు, అతను మళ్లీ తనను తాను నిరూపించుకోవాలని కనిపించింది. ధావన్ ఇటీవల ముగిసిన ఇండియా వెర్సెస్ వెస్ట్ ఇండీస్ T20I సీరీస్ లో మొత్తం 96.42 స్ట్రైక్ రేట్ తో 1,23 మరియు 3 స్కోర్స్ తో తిరిగి వచ్చాడు. నిజానికి, అతను ఈ సంవత్సరంలో మొత్తం ఏడు ఇన్నింగ్స్ లో సగటు 15 తో కేవలం 105 పరుగులు సాధించాడు. ఈ పరుగులు కేవలం రన్-ఏ -బాల్ గా వచ్చాయి.

అవును, ఈ ఏడాది కూడా అతను ఇండియన్ T20I లీగ్ లో గొప్ప పరుగులు చేసాడు. 34.73 సగటుతో 521 పరుగుల లెక్కతో మరియు 135.67 స్ట్రైక్ రేట్ అతను మంచి ఫామ్ లో ఉన్నట్లు సూచించింది. కానీ అతను దాన్ని ఏదో రకంగా అంతర్జాతీయ స్థాయిగా మార్చలేకపోయాడు. రెండు నెలల క్రితం ప్రపంచ కప్పు జరిగిన సమయంలో అతను ఎదుర్కొన్న గాయం తరువాత అతను మళ్లీ తిరిగి వచ్చినట్లు మాత్రమేనని వాదనలు జరిగాయి.

అయితే, వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే T20 ప్రపంచ కప్పు కోసం ఇండియా క్రికెట్ జట్టుతో తమ ప్రణాళికల్ని విజయవంతం చేసుకోవడానికి ఇండియా క్రికెట్ జట్టుతో ఎదురుచూస్తున్న ధావన్ కు ఇండియా మరియు దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న సీరీస్ యొక్క తక్కిన రెండు T20ఐలలో భారీగా స్కోర్ చేయడానికి అతను విఫలమైతే రాబోయే సమయంలో ధావన్ తనను తాను నిరూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు లేవు. కాబట్టి అతను అడుగు పెట్టవల్సిన సమయం ఇది.

రచయిత: ప్రసేన్ జిత్ డే