భారతీయ బ్యాటింగ్ బలశాలిని సంబాళించడానికి దక్షిణ ఆఫ్రికా జట్టు బాగానే తయారీలు చేసుకున్నట్లుగా ఇండియా మరియు దక్షిణాఫ్రికా మధ్య ఇటీవలనే ముగిసిన టీ20ఐ సీరీస్ లో రోహిత్ శర్మ డిస్మిసల్స్ తెలియజేశాయి.
మొహాలీలో జరిగిన రెండవ టీ20ఐ లో ఈ 32-ఏళ్ళ బ్యాట్స్ మన్ ఆండైల్ ఫెహ్లుక్వాయోచే కేవలం 12 పరుగులకే లెగ్-బిఫోర్ వికెట్ రూపములో డిస్మిస్ చేయబడ్డాడు. మరియు బెంగళూరులో జరిగిన ఫైనల్ టీ20ఐ లో, ఇన్నింగ్స్ లో అతి త్వరగా రోహిత్ పై ఒత్తిడి పెంచడానికి ప్రత్యేకంగా జట్టులోకి తీసుకురాబడిన బ్యూరాన్ హెండ్రిక్స్ బౌలింగ్ లో అతను స్లిప్స్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. కాబట్టి, ఈ డిస్మిసల్స్ జరిగిన తీరును బట్టి చూస్తే, దక్షిణ ఆఫ్రికా జట్టు రోహిత్ అడ్డంకిని తప్పించుకోవడానికి పక్కా ప్రణాళికతో ఇక్కడికి వచ్చినట్లుగా చెప్పవచ్చు.
ఇక అక్టోబర్ 2 న విశాఖపట్నంలో మొదటి టెస్ట్ మ్యాచ్ తో మూడు-మ్యాచ్ ల టెస్ట్ సీరీస్ మొదలైనప్పుడు, భారత జాతీయ క్రికెట్ జట్టు కొరకు ఇన్నింగ్స్ ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్న ఈ భారతీయ బ్యాటింగ్ రాక్షసుణ్ణి వదిలించుకోవడానికి వారు తమ చేతుల్లో మరి కొన్ని ఉపాయాలను కలిగియుంటారని ఖచ్చితంగా చెప్పవచ్చు.
వాస్తవానికి, టెస్టులలో రోహిత్ చే ఓపెనింగ్ చేయడంలో జట్టు యాజమాన్యము యొక్క ఆకాంక్ష, క్రికెట్ సమాజం యొక్క ప్రతి మారుమూల నుండీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. తిరుగుకుంటూ వచ్చే ఎరుపు బంతిపై అతని ఇబ్బందుల గాధలు ఏ ఒక్కరికీ తెలియనివేమీ కావు. ఐనా, అతణ్ణి ఓపెనర్ గా పంపించాలనే వారి నిర్ణయం ఎంతో పిచ్చితనంతో కూడిన పని.
ఔను, పేసర్లకు అంతగా అనుకూలించని భారతీయ బ్యాటింగ్ ట్రాక్స్ పై అతను రాణించవచ్చనడానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయి. ఐతే కదిలే ముందు ఒక హెచ్చరికగా సైతమూ – తెలుపు- బంతి క్రికెట్ లో సైతమూ – మునుపటి సందర్భాల్లో అతను ఇబ్బందిపడినట్లుగా ఋజువయింది. కాబట్టి, టెస్టుల్లో ఇన్నింగ్స్ ను ఓపెనింగ్ చేయడం అనేది, అతనికి ఎంతో క్లిష్టమైన పని కాబోతోంది మరియు దక్షిణాఫ్రికా పేస్ దాడి పట్ల అతని రికార్డు ఈ వాస్తవాన్ని తెలియజేస్తోంది.
ఈ సీరీస్ కొరకు దక్షిణాఫ్రికా జట్టు నలుగురు పేసర్లు – కాసిగో రబాడా, లుంగీ ఎన్‌గిడీ, వెర్నాన్ ఫిలాండర్ మరియు ఎన్‌రిచ్ నార్టిజే లతో పర్యటిస్తోంది. రోహిత్ భారత టెస్ట్ క్రికెట్ జట్టు లో ఇంకా నార్టిజే మరియు ఎన్‌గిడీ ల దాడులను ఇంకా సరిగ్గా ఎదుర్కోవలసి ఉన్నప్పటికీ, రబాడా మరియు ఫిలాండర్ పై అతని రికార్డు, ఓపెనింగ్ అనేది అతని పట్ల ఎంత పెద్ద సవాలుగా ఉండబోతున్నదో అర్థమవుతుంది.
రబాడా మరియు ఫిలాండర్ ఇద్దరూ వరుసగా అతనికి 58 మరియు 50 బంతులు వేసి రోహిత్ ను టెస్టుల్లో చెరి మూడు సార్లు డిస్మిస్ చేసి ఉన్నారు. మరియు వారిద్దరూ కలిపి వేసిన ఆ 108 బంతుల్లో 87 డాట్ బాల్స్ గా ఉన్నాయి. కాబట్టి, ఈ ఇద్దరు బౌలర్లు రోహిత్ పై ఎలా పైచేయితో ఉన్నారో ఈ విషయం తెలియజేస్తుంది. మరో వైపున, ఎన్‌గిడీ, ఇంతవరకూ టెస్టులలో ఎటువంటి విజయమూ లేకుండా రోహిత్ కు కేవలం ఆరు బంతులు మాత్రమే వేసి ఉన్నాడు. ఐతే టీ20ఐ ఫార్మాట్ లో అతడు ఇప్పటికే 20 బంతుల్లో అతణ్ణి రెండుసార్లు డిస్మిస్ చేసి ఉన్నాడు. దక్షిణాఫ్రికా పేసర్లపై అతను ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో ఈ విషయం మరొక్కసారి గుర్తు చేస్తుంది.
దక్షిణాఫ్రికేయుల కోసం తన మెయిడెన్ టెస్టు ఆడుతున్న ఏన్‌రిచ్ నార్టిజే కూడా ఇంకా ఉన్నాడు కాబట్టి ఆ ఇబ్బంది ఇక్కడితో ముగిసిపోదు. అయినప్పటికీ, అతడు స్థిరంగా గంటకు 145 కిలోమీటర్ల వేగముతో బంతిని విసరగలడు కాబట్టి రోహిత్ పట్ల సింహస్వప్నం కాగల సమర్థత అతనికి మెండుగా ఉంది.
కాబట్టి ఈ సీరీస్ లో రోహిత్ ను ఓపెనర్ గా పంపించాలనే భారత వ్యూహము కొరకు సంకేతాలు అంత మంచివిగా కనిపించడం లేదు. అలా ముందుకువెళ్ళడానికి అంకెలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ, ఒకవేళ రోహిత్ రాణించగలడేమో వేచి చూడాల్సి ఉంది.
రచన:ప్రసెంజిత్ డే
అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ కొత్త ప్రాంతీయ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని ఏర్పాటు చేసింది, దీనిలో కంపెనీ దఫాబేట్ ఆసియా మార్కెట్లో అధికారిక… ఇంకా చదవండి
U19 క్రికెట్ ప్రపంచ కప్ 2018 ఫైనల్ - ముఖ్యాంశాలు. భారతదేశం U19 ప్రపంచ కప్ గెలిచింది! ఇండియా vs… ఇంకా చదవండి
రోరే మక్లెరాయ్ 9-అండర్ 61 కార్డ్ను టోర్నమెంట్ను 22-అండర్ పార్ వద్ద ముగించి, తన పదహారవ కెరీర్ PGA టూర్… ఇంకా చదవండి
2019 పిజిఎ ఛాంపియన్షిప్ చివరి రౌండ్లో బ్రూక్స్ కోయిప్కా 4 ఓవర్ల 74 పరుగులు చేశాడు ఇంకా చదవండి
బ్రాంప్టన్ కెనడాలో మ్యాచ్ యొక్క పూర్తి ముఖ్యాంశాలను చూడండి, గ్లోబల్ టి 20 (జిటి 20) కెనడా 2019 యొక్క… ఇంకా చదవండి