Join Dafanews today and get to enjoy our Free to Play Games.
Join Dafanews

Welcome, !

You have successfully created your account. You can now enjoy our FREE TO PLAY GAMES

Play Now Play Now

Welcome, !

You have successfully created your account. You can now enjoy our FREE TO PLAY GAMES or access our wide range of DAFABET products

Can't Login?

Stay in Loop!

Join our Telegram community for the latest sports news, highlights, live scores, and more.


వ్రాసిన వారు Website Admin
ఐ.ఎస్.ఎల్ 2019:ఎటికె పోటీదారులను అధిగమించడానికి హాబాస్ సూత్రము

ఐ.ఎస్.ఎల్ 2019:ఎటికె పోటీదారులను అధిగమించడానికి హాబాస్ సూత్రము

November 12, 2019

కొత్త హీరో ఇండియన్ సూపర్ లీగ్ (ఐ.ఎస్.ఎల్) క్యాంపెయిన్ కొరకు ఎటికె హెడ్ గా ఆంటోనియో లోపెజ్ హాబాస్ పునర్నియామకం, రెండు సార్లు ఛాంపియన్లుగా నిలిచిన వారు సైతమూ గ్రూప్ దశ కూడా దాటడంలో విఫలమైన రెండు నిరాశాజనక సీజనులను చూసిన తదనంతరం అభిమానులచే ఆశావాదంతో స్వీకరించబడింది. హీరో ఐ.ఎస్.ఎల్ యొక్క ప్రారంభోత్సవ సంవత్సర విజేతలుగా ఎటికె నిలిచినప్పుడు పీఠంలో ఉన్నది హాబాస్ మరి.

మొదటి రెండు సీజన్లకు ఈ స్పానిష్ కోచ్ ఎటికె బాధ్యులుగా ఉన్నారు, అప్పుడు టైటిల్ విజయం మరియు ఒక సెమీ-ఫైనల్ ముగింపుతో ముగిసింది. జోస్ మొలీనా ఆధ్వర్యములో కూడా ఎటికె మూడవ హీరో ఐ.ఎస్.ఎల్ సీజన్ గెలుచుకొంది, ఐతే సెమీ ఫైనల్స్ కు వెళ్ళడంలో వైఫల్యంతో ఆ తదుపరి రెండు క్యాంపెయిన్లలో వారి అదృష్టాలు తీవ్ర తిరోగమననాన్ని చవి చూశాయి. కోల్‌కతా-ఆధారిత క్లబ్, క్లబ్ కొరకు పునర్వైభవాన్ని మళ్ళీ తీసుకువచ్చే బాధ్యత అప్పగించబడి యున్న స్టీవ్ కోపెల్ యొక్క నేతృత్వ బోధనా పూర్వకశిక్షణ క్రింద లీగ్ స్టాండింగ్స్ లో ఆరవ చోటులో గత సీజన్ ని ముగించింది.

ఎటువంటి విధమైన సృజనాత్మకత మరియు బలమైన ఆకాంక్ష చూపకుండానే ఎటికె చేసిన నిస్సారమైన ప్రదర్శనలతో వాస్తవరూపము దాల్చినది చాలా విభిన్నంగా ఉండినది. చెప్పుకోలేని వారి ప్రదర్శనలు కేవలం పిచ్ పైన మరియు ఫలితాలపైన ప్రతిఫలించడమే కాకుండా, అభిమానులు తాము చూస్తున్న ప్రదర్శన పేలవమైనది అనే భావనలు పెరిగిపోవడం ద్వారా అత్యధికంగా ఖాళీగా కనిపించిన స్టాండ్లలో కూడా ప్రతిబింబించింది.

కోచ్ లు ఇద్దరు కూడా ఆట యొక్క ఒకే రకమైన కార్యసాధక శైలిని అవలంబించినప్పటికీ కూడా, స్వాభావికంగా హాబాస్, కోపెల్ కు విరుద్ధమైన భావజాలం కలిగియున్న వ్యక్తి. స్పానిష్ వ్యక్తి ఆంగ్లేయుడిపై విజయం సాధించడానికి అనువుగా మలచుకోవడమనేది ఒక కీలకమైన అంశమని అది తెలియజెప్పింది. క్లబ్బుతో వాళ్ళ ఇద్దరి ఒడంబడికల సమయాల్లో ఇది నిరూపితమైంది. ప్రధాన ఆటగాళ్ళతో కుదించబడిన జట్టుతో 2014 హీరో ఐ.ఎస్.ఎల్ ఫైనల్ లో కేరళ బ్లాస్టర్స్ పై అనూహ్యమైన విజయం సాధించడానికి హాబాస్ యొక్క యుక్తుల సానుకూలత సహాయపడగా; కోపెల్ యొక్క వ్యూహాత్మక చతురత అతడు అనుకున్నట్లుగా జరగనప్పుడల్లా అతడు విఫలమయ్యేలా చేసింది.

అన్నీ తెలిసిన కోపెల్ వలె కాకుండా, హాబాస్ శైలి కూడా ఎటికె ఆటగాళ్ళు మరియు అభిమానుల గుండెల్లో తిరిగి నిప్పును రాజేస్తుంది. తన భావోద్వేగాలను చేతులపై భరించే వ్యక్తిగా గుర్తింపు పొందిన హాబాస్, పేలవమైన మరియు పసలేని ప్రదర్శనలతో విశ్రమించడు, అది ఎటికె ని గత రెండు సీజన్లలో లక్షణాత్మకంగా చేసింది. ఎటికె యొక్క అమ్ములపొదిలో ప్రతిభ గల ఆటగాళ్ళ జోడింపు – కొత్త మరియు పాతల మేలి కలయిక – అంత వరకూ మరియు ఈ సంవత్సరం వారి అదృష్టాలలో ఒక పునరుజ్జీవమును చూడడం అంత కష్టమేమీ కాదు.

వాస్తవానికి, ఎటికె తో రెండో ఒడంబడికలో ఒకవేళ ఏవైనా హాబాస్ ఐచ్ఛికాలు మొదటిదానికంటే చాలా మెరుగైనవిగా ఉంటాయి. మాన్యువెల్ లాంజారోట్, ఎడూ గార్సియా, జోబీ జస్టిన్ మరియు మైఖేల్ సుసైరాజ్ లు, హాబాస్ కు మొదటి విడతలో అతని ప్రభావపూరితమైన దాడి త్రయం – ఫిక్రూ, జోఫ్రే మేట్యూ మరియు లూయిస్ గార్సియా ఇష్టాలకు అత్యంత శ్రేష్టమైనటువంటి దాడిచేసే ఎంపికల అస్త్రశస్త్రాలను ఇస్తారు.

ఎటికె తో అతని మొదటి విడతలో రక్షణాత్మక ఫుట్‌బాల్ జట్టు కొరకు ఆడినందుకు ఈ స్పానియార్డ్ విమర్శించబడ్డాడు, అయినప్పటికీ, బెంచ్ నుండి అతడు దాడిచేసే ఐచ్ఛికాలను విశ్లేషణ చేస్తున్నప్పుడు, అతడు వాస్తవంగా ఎంపికను పాడు చేయలేదనే విషయం తరచుగా విస్మరించబడింది. ఈ సారి అటువంటి సాకులు ఏవీ ఉండకపోయినప్పటికీ, మరియు స్ఫూర్తికలిగించని రెండు క్యాంపెయిన్ల తర్వాత, ఎటికె అభిమానులు మరియు స్వంతదారులు ఇద్దరూ భారతీయ ఫుట్‌బాల్ ఆటలు యొక్క ఉత్సాహపూరిత బ్రాండు కంటే తక్కువైన దేనితోనూ విశ్రమించబోరు.

దేశంలోని అత్యుత్తమ జట్లతో పోటీపడేలా క్లబ్బును పోటీ లోనికి తిరిగి తీసుకురాగలగడమనేది రాత్రికి రాత్రి జరగకపోవచ్చు, ఐతే హాబాస్ లో, ఆ విషయంలో తిరిగి రాని ఏ రాయినీ వదలకూడదనే పట్టుదల కలిగియున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని మొదటి కార్యాచరణ మాత్రం తన ఆటగాళ్ళు తమ ఫుట్‌బాల్ క్రీడను ఆస్వాదించేలా చేయడంపై ఉంటుంది, కొంతవరకూ దాన్ని గత సీజనులో వాళ్ళు చేసినట్లుగా కనిపించలేదు. దాడితో కూడిన ఫుట్‌బాల్ అభిమానులను స్టాండ్లలోనికి తిరిగి వచ్చేలా చేస్తుంది, అంతే కాకుండా, ఎటికె తో హాబాస్ యొక్క మొదటి సీజనులో ప్రత్యేకంగా కనిపించినట్లుగా ఉప్పునీటి సరస్సు స్టేడియంను భీతిగొలిపే ధ్వనులతో మారుమ్రోగించేలా కూడా చేస్తుంది.

ఆటగాళ్ళు తమ సామర్థ్యం మేరకు అత్యుత్తమంగా ఆడేలా అతడు చేయగలిగాడంటే, లీగ్ యొక్క మొదటి మూడు ఎడిషన్లలో చాలా బాగా పని చేసిన విజయ సూత్రమును రెండు-సార్ల ఛాంపియన్లు పునరుద్ధరించుకున్నట్లుగా కనిపిస్తున్నారని అభిమానులు తప్పనిసరిగా మరింత ఎక్కువగా నిమగ్నమవుతారు. అది అప్పటికప్పుడు జరుగుతుందా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా, పోగొట్టుకున్న తేజస్సును తిరిగి పొందడానికై సీజను తదనంతర చర్యలలో తిరిగి మొదటికి వెళ్ళాలని వారిలో కనిపించిన తపన విషయములో ఎటికె అభిమానులు సంతోషంగా మరియు ఆశాదాయకంగా ఉండవచ్చు. (మరిన్నిభారతీయ ఫుట్‌బాల్ జట్టు వార్తలు కొరకు క్లిక్ చేయండి)

రచన: నితిన్ జాన్

రచయిత గురుంచి


వ్రాసిన వారు Website Admin

×
Embed Code