Join Dafanews today and get to enjoy our Free to Play Games.
Join Dafanews

Welcome, !

You have successfully created your account. You can now enjoy our FREE TO PLAY GAMES

Play Now Play Now

Welcome, !

You have successfully created your account. You can now enjoy our FREE TO PLAY GAMES or access our wide range of DAFABET products

Can't Login?

Stay in Loop!

Join our Telegram community for the latest sports news, highlights, live scores, and more.


వ్రాసిన వారు Website Admin
బాక్సింగ్:తన ఒలంపిక్ స్వప్నాన్ని నెరవేర్చుకోవడానికి వికాస్ క్రిషన్ స్వదేశానికి తిరిగి వచ్చాడు

బాక్సింగ్:తన ఒలంపిక్ స్వప్నాన్ని నెరవేర్చుకోవడానికి వికాస్ క్రిషన్ స్వదేశానికి తిరిగి వచ్చాడు

January 31, 2020

ఒక విశిష్టమైన పరిణతి పొందిన బాక్సింగ్ కెరీర్ పొందిన తర్వాత, 2018 నవంబరులో అగ్రశ్రేణి ఐ.ఎన్.సి తో వికాస్ క్రిషన్ బహు-వార్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు, కాగా అతడు గతంలో మహమ్మద్ అలీ, జార్జ్ ఫోర్‌మన్, సుగర్ లే లియొనార్డ్, ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ మరియు అత్యంత ఇటీవలనే విజేందర్ సింగ్ లచే ప్రోత్సహింపబడ్డాడు.అమెరికా – ఆధారిత సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత క్రిషన్ ఒక ప్రో-బాక్సర్ గా కెరీర్ మలచుకోవడానికై నెవార్క్ వెళ్ళాడు.

తన మొదటి రెండు వృత్తిప్రావీణ్యమైన పోరులలో రెండు ఆధిపత్య విజయాల తదనంతరము, ప్రపంచము యొక్క అత్యంత ప్రసిద్ధి చెందిన కార్యక్షేత్రం ది మాడిసన్ స్క్వేర్ గార్డన్ యందు ఈ 27-సంవత్సరాల వ్యక్తి ద్వితీయుడిగా వస్తూ, భారత బాక్సింగ్ కూటమిని గమనంలో ఉంచాడు.

క్రిషన్ సమస్తమూ సరిగ్గా చేశాడు. అతడు తనకు తాను విజయం దిశగా సరైన మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. ఐతే తన మూడవ పోరుకు సిద్ధపడటానికి బదులుగా, క్రిషన్ పాటియాలో లోని ఎన్.ఐ.ఎస్ హాస్టల్ కు తిరిగి వచ్చాడు, అక్కడ అతడు తన అంతిమ లక్ష్యాన్ని వేటాడుతూ దగ్గరదగ్గరగా ఒక దశాబ్ద జీవితకాలం గడిపాడు.

2012 లో అర్జున అవార్డు గ్రహీత అయిన క్రిషన్, ఔత్సాహిక క్రీడలో సాధించడానికి తగినంతగా దాదాపుగా సాధించేశాడు. అతడు మిడిల్ వెయిట్ విభాగములో వరుసగా 2014 మరియు 2018 ఎడిషన్లలో ఇంచియాన్ మరియు జకార్తాలలో కాంస్యం గెలవడానికి ముందుగా గువాంఝౌ లో జరిగిన 2010 ఆసియా క్రీడలలో 60 కిలోల విభాగములో బంగారు పతకం గెలుచుకున్నాడు, తద్వారా నేరుగా మూడు ఆసియా క్రీడలలో ఒక పతకం గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్లలో ఒకడిగా అయ్యాడు. 2018 లో జరిగిన కామన్‌వెల్త్ క్రీడలలో, మిడిల్ వెయిట్ విభాగములో
బంగారు పతకం గెలుచుకోవడం ద్వారా తన ఉజ్వలమైన కెరీర్ కు అతడు మరొక అధ్యాయాన్ని జోడించాడు.

ప్రతి పెద్ద బాక్సింగ్ మ్యాచ్ లోనూ అతడు విజయం పొందగా, ఒలంపిక్స్ లో అతని పనితీరులు మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయి. లండన్ లో జరిగిన 2012 క్రీడల్లో అతడు ప్రిలిమినరీ రౌండులోనే బయటికి నెట్టివేయబడ్డాడు మరియు 2018 లో రియోలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో ఉజ్బెకిస్తాన్ కు చెందిన బెక్టెమిర్ మెలికుజీవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఒలంపిక్స్ లో విజయం ఆయన్ని తప్పించుకొంది మరియు అంతకుముందు అతడు వృత్తిపరమైన క్షేత్రంలోనికి మారాడు, తర్వాతి సంవత్సరం టోక్యోలో పోటీ చేసి దానికి మరొక షాట్ ఇవ్వాలనే తన ఆకాంక్ష గురించి తాను టాప్ ర్యాంకుతో
పారదర్శకంగా ఉన్నట్లుగా అతడు రూఢి చేసుకున్నాడు.

ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నేను ఒప్పందముపై సంతకం చేసేటప్పుడు నా దృష్టి అంతా టాప్ ర్యాంక్ పైనే (టోక్యో 2020) ఉంటుందని చెప్పాను మరియు నా సంభావ్య పోరును తప్పించుకున్నప్పటికీ, నేను ఒలంపిక్స్ తప్పించుకోలేను,” అన్నాడు. ఒక గాయం నుండి తిరిగి కోలుకుంటూ ప్రస్తుతం క్రిషన్ నవంబరులో జరిగే ప్లంపిక్ క్వాలిఫయర్స్ లో పాల్గొనాలని అనుకుంటున్నాడు. అయినప్పటికీ, ఒక వృత్తిపరమైన బాక్సర్ గా తన ప్రయాణాన్ని కొనసాగించడానికి నెవార్క్ కు తిరిగి వెళ్ళే ముందుగా ఒక ఒలంపిక్ పతకము సాధించిన ఏకైక రెండవ భారతీయ బాక్సర్ గా కావాలన్నదే అతని అంతిమ ధ్యేయంగా ఉంది.

గడచిన సంవత్సరము తాను ఒక బాక్సర్ గా ఎదగడానికి సహాయపడిందని క్రిషన్ విశ్వసిస్తాడు. “లండన్ మరియు రియో క్రీడలకు ముందు నాకు ఇంతటి ధృఢమైన విశ్వాసం ఉండేది కాదు. ప్రో సర్క్యూట్ లో బాక్సింగ్ చేసిన తర్వాత, అది సంపూర్ణంగా విభిన్నంగా ఉంది.నేను ఒక పతకాన్ని గెలవగలుగుతాను. మీరు ఎంత మంచి బాక్సర్ అయిఉన్నప్పటికీ, ప్రో లో ఒకే ఒక పంచ్ మిమ్మల్ని క్రిందపడేస్తుంది కాబట్టి అది చాలా కష్టంగా ఉంటుంది. ప్రో లో ఒక బాక్సర్ గా మీరు ఒంటరివారే. మీరు ప్రతి విషయాన్నీ చూసుకోవాల్సి ఉంటుంది మరియు అది మిమ్మల్ని మరింత ఆధారపడేలా చేస్తుంది మరియు మీరు ఎంతగానో ఆలోచిస్తారు,” అని అన్నాడు.

నవీకరించబడిన స్ఫూర్తి, ప్రశాంతమైన మనస్సు మరియు మెరుగు పరచుకొన్న నైపుణ్యాలతో, తాను ఎప్పటికంటే మెరుగ్గా ఉన్నానని క్రిషన్ నమ్ముతాడు. ఇప్పటికి అతడు తన కచ్చితమైన వృత్తినైపుణ్య కెరీర్ కు ఒక ఆపుదలను ఉంచి ఒక తప్పును సరిచేసుకోవడానికి స్వదేశానికి తిరిగి వచ్చాడు. అతడు మరియు ప్రపంచము అతని ఒలంపిక్ కెరీర్ ని ఎలా గుర్తు ఉంచుకుంటుందనేది మార్పు చేయడానికి. తన స్వప్నం వెనుక ఒక సీతాకోక చిలుక లాగా స్వేచ్ఛగా ఎగరడానికి, మరియు ఒక తేనెటీగ లాగా పోటీలో కుట్టి, ఒక ఒలంపిక్ పతకాన్ని తిరిగి తెచ్చుకొని చరిత్రలో తన పేరును లిఖించుకోవడానికి అతడు స్వదేశానికి తిరిగి వచ్చాడు. రచన:క్రీడా ముఖాముఖీ

రచయిత గురుంచి


వ్రాసిన వారు Website Admin

×
Embed Code