రెజ్లింగ్

గంట మ్రోగించండి:వదిలివేయడానికి సుశీల్ కు ఇది సరైన సమయం

సుశీల్ కుమార్ ఒలంపిక్స్ లో ఒక పతకం గెలుపొందిన ఏడవ భారతీయ అథ్లెట్ అయినప్పుడు అది ఒక ఘనవిజయ గాధ అయింది. జాతీయవాదులు, ఆసియా రెజ్లింగ్ సన్నివేశము అదే విధంగా కామన్‌వెల్త్ ఛాంపియన్‌షిప్స్ పై ఆధిపత్యం వహించిన అనేక సంవత్సరాల తర్వాత, దేశానికి మొట్టమొదటి పతకాన్ని సాధించిన ఖాషాబా దాదాసాహెబ్ జాదవ్ తర్వాత 56 సంవత్సరాలకు రెజ్లింగ్ లో ఒక ఒలంపిక్ పతకాన్ని స్వదేశానికి తీసుకురావడం ద్వారా అతడు బీజింగ్ లో తాను ఆశించిన మేరకు రాణించాడు.

ఐతే సుశీల్ ప్రారంభం మాత్రమే సంపాదించాడు. అతడు 2010 లో మాస్కోలో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ లో బంగారు పతకం సాధించాడు, ఆ మరుసటి సంవత్సరం లోనే ఏషియన్ ఛాంపియన్‌షిప్స్ లో మరొక పతకం సాధించాడు మరియు 66 కిలోల ఫ్రీస్టైల్ కిరీటం పొందడానికి ఫేవరైట్ గా 2012 లండన్ క్రీడల బరిలోనికి దూసుకువెళ్ళాడు. అతడు ప్రాథమిక రౌండ్ల గుండా ముందుకు వెళ్ళాడు, సెమీస్ లో వివాదాస్పద పరిస్థితుల్లో కజగిస్థాన్ కు చెందిన అక్జురెక్ తనాతరోవ్ ను ఓడించి భారత్ కోసం కనీసం ఒక రజత పతకాన్ని సాధించాడు. కోట్లమంది ఆశలు ఆకాంక్షలు తన వెన్నంటి ఉండగా అతడు జపాన్ కు చెందిన తత్సుహిరో యోనెమిత్సుతో తలపడ్డాడు, ఐతే అందులో జపనీయులనే విజయం వరించగా సుశీల్ రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఒకవేళ ఎవరైనా సుశీల్ యొక్క కెరీర్ కి అంకగణిత సమీకరణాన్ని వర్తింపజేసి మరియు వరుసగా 2008 మరియు 2012 లో అతడు గెలుపొందిన కాంస్యం మరియు రజతంతో గణిస్తే, 2016 లో ఆ రెజ్లర్ బంగారు పతకం కోసం లక్ష్యంగా చేసుకున్నాడని తీర్మానిస్తారు. సుశీల్ కూడా దానినే విశ్వసించాడు. ఐతే, దురదృష్టవశాత్తూ, జీవితం ఒక గణిత సమీకరణము కాదు. లండన్ ఒలంపిక్స్ అనంతరం 74 కిలోల విభాగానికి తరలిన తర్వాత, 2014 లో సుశీల్ తన కేబినెట్ కు మరొక కామన్‌వెల్త్ క్రీడల బంగారు పతకాన్ని జోడించాడు, అయినప్పటికీ, 2016 రియో క్రీడల కొరకు అతని తయారీలను రెండు గాయపడ్డ సంవత్సరాలు మరుగున పడేశాయి. ఆ ఘనవిజయం అనంతరం అతడు పోటీపడలేదు మరియు బ్రెజిల్ కు నర్సింగ్ యాదవ్ వెళ్ళి 74 కిలోల ఫ్రీస్టైల్ విభాగానికి ప్రాతినిధ్యం వహించడాన్ని చూడాల్సి వచ్చింది.

అతని గాయాలు బాధించిన దానికంటే ఒలంపిక్స్ యొక్క అవమానం నొప్పి సుశీల్ ని ఎక్కువగా బాధపెట్టింది.ఐతే అతని స్వప్నం మాత్రం చెదిరిపోలేదు.అతడు 2018 కామన్‌వెల్త్ క్రీడల ఫైనల్లో ఆధిపత్య శైలితో కేవలం 80 సెకెన్లలో ప్రత్యర్థిని ఓడించడం ద్వారా బంగారు పతకం సాధించి క్రీడా ప్రపంచానికి తానేమిటో చాటిచెప్పాడు. అయినప్పటికీ, నాలుగు నెలల తర్వాత అతను ఏషియన్ క్రీడలలో కనిపించడమనేది అనుకున్న విధంగా జరగలేదు. అతడు క్వాలిఫయింగ్ రౌండులో బెహ్రయిన్ కు చెందిన ఆడం బారిటోవ్ చేతిలో నిర్ఘాంతపోయే ఓటమిని చవి చూసి ఖాళీ చేతులతో స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఆగస్టులోని ఆ పోరాటం ఆ సంవత్సరానికి ఆఖరిదయింది.

దాదాపు ఒక సంవత్సరం గడచిన తర్వాత మిన్‌స్క్ లోని మెడ్వెడ్ టోర్నమెంటులో అతడు వేదికపైకి తిరిగి వచ్చాడు ఐతే బెక్జోడ్ అబ్దురక్‌మొనోవ్ చేతిలో ఘోరమైన ఓటమిని చవి చూశాడు. అతను తన ఓటమిని రింగ్-రస్ట్ పై నిందమోపాడు, కానీ అక్కడ అంతకంటే ఎక్కువే జరిగినట్లనిపించింది. ఈ 36-ఏళ్ళ వ్యక్తి తన స్వదేశానికే చెందిన జితేందర్ కుమార్ ని ఓడించి నూర్-సుల్తాన్ ప్రపంచ ఛాంపియన్ ‌షిప్స్ లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు, అయితే ఎనిమిది సంవత్సరాలలో మొదటిసారిగా అతను పోటీలోనికి తిరిగి రావడం అంత ఉల్లాసంగా లేకపోయింది. తన మొట్టమొదటి రౌండులోనే అతడు ఖాద్జీమురద్ గాడ్జియేవ్ చేతిలో ఓటమి చెందాడు, అయినా ఊహించని తన ఓటమికి మళ్ళీ తయారీ లోపమని నిందించాడు.

సుశీల్ మే నెలలో తన 36 వ ఏట ప్రవేశించాడు. గడచిన అతని మూడు పోరాటాల్లో, ఈ వస్తాదు తన స్వీయ ఆధిపత్య నీడనే చూసుకున్నాడు. అతని అడుగులు తడబడ్డాయి, అతని ఆత్మరక్షణ అంత సమంజసంగా లేకపోయింది మరియు ఆఖరుకు, అతని ప్రత్యర్థులు అన్ని రంగాల్లోనూ అతనికంటే కాస్త ఆధిపత్యం చూపారు. ఊరించే బంగారు పతకం కోసం సుశీల్ తన అన్వేషణ కొనసాగించాలనే ప్రతినబూనాడు, ఐతే అది వాస్తవమయ్యే లక్ష్యమేనా అని అతడు భావించాల్సిన సమయం వచ్చి ఉండొచ్చు. “ఒకప్పుడు ఓటమే లేకపోయింది” అనే సామెత సుశీల్ ఉదంతములో అక్షరసత్యం అనిపించింది. దేశం యొక్క అత్యంత ఆధిపత్య అథ్లెట్లలో ఒకరైన ఇతణ్ణి వయసు మరియు గాయాలు చుట్టుముట్టాయి. కాబట్టి, బహుశా ఇది, సుశీల్ తన పోరాటాలను వదిలేసి, తన వారసత్వాన్ని రక్షించుకోవాల్సిన సమయం అయి ఉండవచ్చు.

రచన: క్రీడా ముఖాముఖీ

రచయిత గురుంచి


వ్రాసిన వారు Website Admin

Related Post
వాటా
ద్వారా ప్రచురించబడింది
Website Admin

ఇటీవలి పోస్ట్లు

అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ దఫాబేట్ని ఆసియాలో ప్రాంతీయ స్పాన్సర్గా అందజేస్తుంది

అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ కొత్త ప్రాంతీయ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని ఏర్పాటు చేసింది, దీనిలో కంపెనీ దఫాబేట్ ఆసియా మార్కెట్లో అధికారిక… ఇంకా చదవండి

March 31, 2023

హైలైట్స్: 2018 U19 క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది

U19 క్రికెట్ ప్రపంచ కప్ 2018 ఫైనల్ - ముఖ్యాంశాలు. భారతదేశం U19 ప్రపంచ కప్ గెలిచింది! ఇండియా vs… ఇంకా చదవండి

February 3, 2020

రోరే మక్లెరాయ్ ముఖ్యాంశాలు | రౌండ్ 4 | ఆర్బిసి కెనడియన్ 2019

రోరే మక్లెరాయ్ 9-అండర్ 61 కార్డ్ను టోర్నమెంట్ను 22-అండర్ పార్ వద్ద ముగించి, తన పదహారవ కెరీర్ PGA టూర్… ఇంకా చదవండి

February 3, 2020

బ్రూక్స్ కోయిప్కా: 2019 పిజిఎ ఛాంపియన్షిప్ చివరి రౌండ్లో అతను తీసిన ప్రతి షాట్ను చూడండి

2019 పిజిఎ ఛాంపియన్షిప్ చివరి రౌండ్లో బ్రూక్స్ కోయిప్కా 4 ఓవర్ల 74 పరుగులు చేశాడు ఇంకా చదవండి

February 3, 2020

టొరంటో నేషనల్ vs మాంట్రియల్ టైగర్స్ | మ్యాచ్ 15 ముఖ్యాంశాలు | జిటి 20 కెనడా 2019

బ్రాంప్టన్ కెనడాలో మ్యాచ్ యొక్క పూర్తి ముఖ్యాంశాలను చూడండి, గ్లోబల్ టి 20 (జిటి 20) కెనడా 2019 యొక్క… ఇంకా చదవండి

February 3, 2020