బ్యాడ్‌మింటన్

సుదీర్మన్ కప్ 2019:పోరాడుతున్న భారతీయ అనిశ్చితికి ఒక కఠిన పరీక్ష

మనం వేసవి కాలం యొక్క ఉధృతికి చేరుకుంటున్న కొద్దీ, అందరి కళ్ళూ చైనా లోని న్యానింగ్ పైనే ఉంటాయి, ఎందుకంటే అక్కడ జరిగే ప్రతిష్టాత్మక సుదీర్మన్ కప్ 2019 లో భారత బ్యాడ్‌మింటన్ జట్టు పాల్గొనబోతోంది. మే 19 నుండి 26 వరకూ, ఆసియా ఖండములో

అత్యుత్తమ బ్యాడ్‌మింటన్ దేశముగా అవతరించడానికై ఒక బిడ్ లో ఇండియా యొక్క అత్యుత్తమ ఆటగాళ్ళు కొందరు ఆసియాకు చెందిన శక్తిశాలులతో పోటీపడబోతున్నారు. ఐతే సరైన ఫామ్ లో లేనట్లుగా బ్యాడ్‌మింటన్ వార్తలలో నిలుస్తూ వస్తున్న కొందరు అథ్లెట్లు, ఇండియా యొక్క ప్రముఖ ముఖాలు, మరి చైనాలో రాణించగలుగుతారా?

ప్రారంభకులకు, ఇండియా యొక్క ఉత్తమ మహిళా షట్లర్లు – సైనా నెహ్వాల్ మరియు పి.వి సింధుకు ఇంతవరకూ ఫలప్రదమైన సీజనులు దక్కలేదు. ఇటీవలనే ముగిసిన న్యూజిలాండ్ ఓపెన్ లో, సైనా మొదటి రౌండులోనే ప్రపంచ నంబర్ 212 వాంగ్ ఝీ యీ చేతిలో ఓటమి పాలయింది.

ఏప్రిల్ లో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్స్ లో, సింధు మరియు సైనా ఇద్దరూ క్వార్టర్ ఫైనల్స్ కు ముందుగానే నిష్క్రమించారు. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఈ ఇద్దరు క్రీడాకారిణులు భారత్ యొక్క అత్యంత అలంకృత క్రీడాకారిణులుగా ఉండగా, వాళ్ళు మహిళల సింగిల్స్ విభాగములో ఆటలో నిజంగానే ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది.(మరిన్ని సైనా నెహ్వాల్ అత్యంత తాజా వార్తల కొరకు)

అశ్వినీ పొన్నప్ప-సిక్కి రెడ్డి మరియు పూర్విషా ఎస్.రామ్ – జె. మేఘన మహిళల డబుల్స్ జట్టుగా ఉంటారు. ఈ జోడీ వాళ్ళ వైపు నుండి అనుభవం కలిగి ఉన్నారు, ఐతే వాళ్ళు బలమైన సవాలును మోయగలిగి మరియు తమ జట్టును విజయం వైపు నడిపించగలుగుతారా అనే దానిని వేచి చూడాల్సి ఉంది.

పురుషుల వైపు నుండి, ప్రపంచ నంబర్ ఎనిమిది కిదాంబి శ్రీకాంత్ సింగిల్స్ ఫార్మాట్ లో పోటీపడబోతున్నాడు.ఆలస్యమైనప్పటికీ, సైనా మరియు సింధూ లాగానే, శ్రీకాంత్ యొక్క ఫామ్ ప్రశ్నార్ధకంగానే ఉంది. ఆశించదగ్గ రీతిలో లేని అతని పనితీరు, ప్రత్యేకించి ఇటీవలనే ముగిసిన ఆసియా బ్యాడ్‌మింటన్ ఛాంపియన్‌షిప్స్ లో అతడి పనితీరు ఆందోళనలు రేకెత్తించింది. అయినప్పటికీ, సుదీర్మన్ కప్ లో ఈ గుంటూరు యువకుడి బలమైన పనితీరు అతని ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపుకోవడానికి పని చేయగలదని ఆకాంక్ష. హైదరాబాద్ కు చెందిన సమీర్ వర్మ కూడా సింగిల్స్ లో పోటీపడబోతున్నాడు మరియు అతడు కూడా తన మార్కు ప్రదర్శించగలడని ఆశించబడుతోంది.

గడచిన సంవత్సరం సుదీర్ఘ కాలం భుజం గాయాలతో బాధపడిన యువకుడు స్వస్తిక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ షెట్టితో పాటుగా ఆడుతూ పురుషుల డబుల్స్ పోటీలో తిరిగి ప్రవేశించబోతున్నాడు. ఏప్రిల్ లో జరిగిన ఆసియా బ్యాడ్‌మింటన్ ఛాంపియన్‌షిప్ లో తప్పిన ఈ జంట తిరిగి గాడిలో పడేందుకు గాను, ఈ టోర్నమెంటు వారికి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతోంది.

ఫేవరైట్లయిన చైనా మరియు మలేషియాలతో పాటుగా ఇండియా గ్రూపు ‘డి’ లో చేర్చబడింది. 2017 ఎడిషన్ లో, క్వార్టర్ ఫైనల్స్ లో ఇండియా తలవంచింది. ఒక్కొక్క గ్రూపు నుండి రెండు అగ్ర జట్లు నాకౌట్ దశలకు అర్హత పొందుతాయి. మలేషియాపై ఇండియా యొక్క ఇటీవలి రికార్డు చూడ చక్కగానే కనిపిస్తోంది, ప్రత్యేకించి గత సంవత్సరం కామన్‌వెల్త్ క్రీడలలో వారి విజయం తర్వాత అది ప్రస్ఫుటంగా ఉంది.ఏది ఏమైనప్పటికీ, చైనాను ఎదుర్కొని అధిగమించడం అనేది మొత్తమ్మీద ఒక విభిన్నమైన కార్యం అవుతుంది.

టోర్నమెంటు దిశగా ముందుకు వెళుతూ, ఇండియా, కాగితంపై ఒక బలీయమైన శక్తిలా అగుపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఇటీవలి స్థిరత్వం నుండి బయటపడి దేశం కోసం రంగంలోనికి అడుగుపెట్టే జవాబుదారీ మాత్రం ఆటగాళ్ళపైనే ఉంటుంది.

రచయిత గురుంచి


వ్రాసిన వారు Website Admin

Related Post
వాటా
ద్వారా ప్రచురించబడింది
Website Admin

ఇటీవలి పోస్ట్లు

అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ దఫాబేట్ని ఆసియాలో ప్రాంతీయ స్పాన్సర్గా అందజేస్తుంది

అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ కొత్త ప్రాంతీయ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని ఏర్పాటు చేసింది, దీనిలో కంపెనీ దఫాబేట్ ఆసియా మార్కెట్లో అధికారిక… ఇంకా చదవండి

March 31, 2023

హైలైట్స్: 2018 U19 క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది

U19 క్రికెట్ ప్రపంచ కప్ 2018 ఫైనల్ - ముఖ్యాంశాలు. భారతదేశం U19 ప్రపంచ కప్ గెలిచింది! ఇండియా vs… ఇంకా చదవండి

February 3, 2020

రోరే మక్లెరాయ్ ముఖ్యాంశాలు | రౌండ్ 4 | ఆర్బిసి కెనడియన్ 2019

రోరే మక్లెరాయ్ 9-అండర్ 61 కార్డ్ను టోర్నమెంట్ను 22-అండర్ పార్ వద్ద ముగించి, తన పదహారవ కెరీర్ PGA టూర్… ఇంకా చదవండి

February 3, 2020

బ్రూక్స్ కోయిప్కా: 2019 పిజిఎ ఛాంపియన్షిప్ చివరి రౌండ్లో అతను తీసిన ప్రతి షాట్ను చూడండి

2019 పిజిఎ ఛాంపియన్షిప్ చివరి రౌండ్లో బ్రూక్స్ కోయిప్కా 4 ఓవర్ల 74 పరుగులు చేశాడు ఇంకా చదవండి

February 3, 2020

టొరంటో నేషనల్ vs మాంట్రియల్ టైగర్స్ | మ్యాచ్ 15 ముఖ్యాంశాలు | జిటి 20 కెనడా 2019

బ్రాంప్టన్ కెనడాలో మ్యాచ్ యొక్క పూర్తి ముఖ్యాంశాలను చూడండి, గ్లోబల్ టి 20 (జిటి 20) కెనడా 2019 యొక్క… ఇంకా చదవండి

February 3, 2020